మ్యానిథాన్ పరుగులో విషాదం: గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన యువతి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూయార్క్
మొదటిసారిగా న్యూయార్క్ నగర మారథాన్ లో పాల్గొన్న ఇరవై నాలుగు సంవత్సరాల రేచెల్ అపా ఫినిషింగ్ లైన్ కు కేవలం రెండు మైళ్ల దూరంలో అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు మరియు అధికారులు వెల్లడించారు. పార్కిన్సన్స్ వ్యాధితో మరణించిన తన తాత జ్ఞాపకార్థం నిధులు సేకరించేందుకు ఆమె ఈ మారథాన్ లో ఉత్సాహంగా పరుగెత్తినట్లు తెలిపారు. తీవ్రమైన కండరాల నొప్పులు మరియు క్షీణతకు గురిచేసే రాబ్డోమయోలిసిస్ కారణంగా ఆమె మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా వైద్యులు తెలిపారు.