రాష్ట్రంలో కలకలం: అయోధ్య, వారణాసి, మధురలో బాంబుల బెదిరింపులతో హైఅలర్ట్
రిపోర్టర్: శివ
స్థలం: Lucknow
అయోధ్య కోర్టుకు వచ్చిన బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య, వారణాసి, మధుర నగరాలలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 8 నుంచి 27 వరకు ప్రముఖ ధార్మిక స్థలాలు, పాఠశాలలపై దాడులు జరుగుతాయని హెచ్చరికలు అందడంతో మల్టీ-ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తుల ఆచూకీ కోసం సైబర్ నిపుణులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.