రామ్‌లీలా మైదాన్ కాంగ్రెస్ ర్యాలీపై ట్రేడర్స్ తీవ్ర అభ్యంతరం: దీపావళి వ్యాపారం దెబ్బతింటుందని ఆందోళన
రిపోర్టర్: గోపి
స్థలం: ఢిల్లీ
రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ర్యాలీని వేరే ప్రాంతానికి మార్చాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ డిమాండ్ చేశారు. దీపావళి సీజన్లో ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఇప్పటికే రూ.3,000 కోట్ల వ్యాపార నష్టం వాటిల్లిందని ఆయన శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. రాకపోకల నిలిపివేత వల్ల చిరు వ్యాపారులు, హోల్‌సేల్ వర్తకులు తీవ్రంగా నష్టపోతున్నారని, ర్యాలీలను రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులకు వర్తక సంఘాలు విజ్ఞప్తి చేశాయి.