పార్లమెంట్లో మాతృత్వంపై ఆస్ట్రేలియా సెనేటర్ ఫాతిమా పాయిమాన్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: రమేష్ స్థలం: కాన్‌బెర్రా

ఆస్ట్రేలియా పార్లమెంట్లో తన కూతురు అలియాను చేతిలో పట్టుకుని సెనేటర్ ఫాతిమా పాయిమాన్ చేసిన ప్రసంగం తీవ్ర చర్చనీయాంశమైంది. మాతృత్వంలోని కష్టాలను, శారీరక ఇబ్బందులను ఆమె బహిరంగంగా పంచుకున్నారు. ప్రసవం తర్వాత శరీరం కోలుకోవడం ఎంత కష్టమో వివరించిన ఆమె, కొత్తగా తల్లి అయిన మహిళలు పడే మానసిక వేదనను ప్రస్తావించారు.