అక్టోబర్ 2న నో యూపీఐ డే పాటించాలని వ్యాపారుల పిలుపు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: భారతదేశం
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీల పెంపునకు నిరసనగా అక్టోబర్ 2న నో యూపీఐ డే పాటించాలని ముంబైకి చెందిన ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యాపారులకు పిలుపునిచ్చింది. రెండు వేల రూపాయలకు మించిన లావాదేవీలపై సున్నా పర్సెంట్ నుంచి 0.4 శాతం ఛార్జీలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రిటైలర్లు, పెట్రోల్ బంకుల డీలర్లు ఈ నిరసనలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.