బాడంగి ఎయిర్‌స్ట్రిప్‌కు పూర్వవైభవం.. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు రంగం సిద్ధం

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

శత్రుదేశాల ముప్పును ఎదుర్కొనేందుకు భారత నావికాదళం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. విజయనగరం జిల్లా బాడంగిలో 80 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌స్ట్రిప్‌ను రక్షణ అవసరాలకు వినియోగించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. విశాఖ ఎన్‌ఏడీకి అనుబంధంగా ఆయుధ భాండాగారం ఏర్పాటు చేసేందుకు నేవీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది 246 ఎకరాల భూమిని సర్వే చేశారు. మరో 1,600 ఎకరాలు అవసరమవుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.