రామాయణం సినిమా నుంచి జై జై రామ్ పాట విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా రామాయణం నుంచి మేకర్స్ తొలి పాట జై జై రామ్ తెలుగు వెర్షన్ను విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ గాత్రం అందించారు. శ్రీరాముడిని స్మరిస్తూ రూపొందిన ఈ భక్తి పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.