రోటరీ నగర్ ఆర్చీ వద్ద అదుపుతప్పి లోయలో పడిన కారు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం రోటరీ నగర్ పోలీస్ హౌసింగ్ కాలనీ ఆర్చీ వద్ద దసరా పండుగ రోజున కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన కారు డ్రైవర్ అదుపుతప్పి సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టగా, పక్కనే ఉన్న ఆటో కూడా దెబ్బతింది. అనంతరం కారు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.