కూటమి సర్కార్ అక్రమాలపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయిన మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం తన వాళ్లకు 99 పైసలకే భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. గీతం యూనివర్సిటీ పేరుతో 55 ఎకరాల భూమిని తన తోడల్లుడికి ఇచ్చారని, విశాఖలో మేయర్, కార్పొరేషన్‌ను హైజాక్ చేశారని విమర్శించారు. ప్రతి గ్రామంలో బెల్టు షాపులు, గంజాయి విరివిగా దొరుకుతున్నాయని, తాగునీటి సమస్యతో పాటు ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.