పాలకొండలో రెండు రోజులుగా చీకట్లోనే మగ్గుతున్న ఇంద్రనగర్ కాలనీవాసులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇంద్ర నగర్ కాలనీలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల ఇరవై ఏడో తేదీ ఉదయం ఎనిమిది గంటల సమయాన కరెంటు నిలిచిపోయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.