భారత టెలికం రంగంలో పదేళ్ల జియో డిజిటల్ విప్లవం

రిపోర్టర్: విజయ్ స్థలం: India

భారత టెలికం రంగంలో రిలయన్స్ జియో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 2016లో రూ.228గా ఉన్న 1GB డేటా ధరను, జియో విప్లవాత్మక ఆఫర్లతో రూ.7.9కి తగ్గించి సామాన్యుడికి ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. నేడు దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది వినియోగదారులతో, సగటు డేటా వినియోగాన్ని 42.3GBకి పెంచి డిజిటల్ విప్లవంలో జియో అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే 3.25 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో జియో సరికొత్త రికార్డు సృష్టించింది.