ఉపాధ్యాయుడి వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, పోక్సో కేసు నమోదు
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయనగరం
శృంగవరపుకోట పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థినిని వేధింపులకు గురిచేయడంతో బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి ఉపాధ్యాయుడు ప్రవీణ్ ఫోన్ చేసి ప్రైవేటుగా కలవాలంటూ వేధించాడు. ఈ వేధింపులు భరించలేక బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.