శక్తివంతమైన ప్రాసెసర్‌తో త్వరలో మార్కెట్లోకి వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: China

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ త్వరలో తన నూతన ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 16ను చైనా మార్కెట్లో విడుదల చేయనుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రానుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. 2ఎన్ఎం ప్రక్రియపై తయారైన ఈ శక్తివంతమైన ప్రాసెసర్ ద్వారా అద్భుతమైన గేమింగ్ మరియు పనితీరు అనుభూతిని పొందవచ్చని సంస్థ తెలిపింది.