విద్యారంగ అభివృద్ధికి భువనగిరిలో కొత్త కమిటీ బాధ్యతల స్వీకరణ

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లాలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నూతన కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా నోముల బసవ రెడ్డి, అధ్యక్షులుగా కొండూరి మల్లేష్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తీగల జయలక్ష్మిని నియమించారు. ప్రధాన కార్యదర్శిగా ఏ.కీర్తి, కోశాధికారిగా ప్యారి బేగంలకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.