నిధుల కొరతతో కుదేలవుతున్న నెల్లూరు జిల్లా పర్యాటక రంగం
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి దుర్గం, సోమశిల జలాశయం, మైపాడు సహా పలు తీర ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండా నిధుల కొరతతో మూలకుపడ్డాయి. ఏళ్ల తరబడి ప్రతిపాదనలు మరుగున పడటంతో పర్యాటకులు రాక నిరుత్సాహం చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి, మౌలిక వసతులు కల్పించి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.