అనంతపురంలో గుర్రమే రథం: కాలు విరిగినా ఆరేళ్లుగా తోటకూ వెళ్తున్న వృద్ధ రైతు
రిపోర్టర్: విజయ్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన రైతు బొన్ను చెన్నారెడ్డి వయసు డెబ్బై ఐదేళ్లు. ఏడేళ్ల కిందట పొలంలో ఎద్దు గాయపరచడంతో ఆయన కాలు విరిగిపోయింది. అప్పటి నుంచి నడవలేని పరిస్థితి ఏర్పడింది. చిన్ననాటి అనుభవంతో కుమారుడి సాయంతో ఆరేళ్ల క్రితం ఒక అశ్వాన్ని కొనుగోలు చేశారు. నాటి నుంచి రోజూ ఉదయాన్నే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన అరటి తోటకు గుర్రంపైనే వెళ్తున్నారు. పనులు ముగించుకొని సాయంత్రానికి ఇంటికి తిరిగొస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు అని స్థానికులు తెలిపారు.