లా విద్యార్థులకు ఊరటనిస్తూ వయోపరిమితి ఎత్తేసిన బార్ కౌన్సిల్
రిపోర్టర్: ANANDA RAO @ PALAKONDA
స్థలం: పాలకొండ
లా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి వయోపరిమితిని తొలగిస్తున్నట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు కు నివేదించింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఏ వయసువారైనా ఎలాంటి నిబంధనలు లేకుండా న్యాయ విద్యనభ్యసించేందుకు పూర్తి అవకాశం లభించింది. సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా BCI తన నిర్ణయాన్ని స్పష్టం చేయడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.