రాప్తాడు ఉన్మాది హేమంత్ కాల్పులపై హైకోర్టులో పిల్ దాఖలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని గోపికపై దాడిచేసిన ఉన్మాది హేమంత్ కు రక్షణగా నిలుస్తూ హైకోర్టులో పిల్ దాఖలైనట్లు న్యాయవాదులు తెలిపారు. హేమంత్ పై కాల్పులు జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సాల్మన్రాజు కోరారు. రాష్ట్ర పోలీసులు నిందితులను కాల్చి హతమారుస్తున్నారని, ఈ ఘటనపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరగా హైకోర్టు ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.