భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేక బస్సులు నడపాలని సీఎం చంద్రబాబు ఆదేశం
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
విశాఖపట్నం పర్యటన ముగించుకొని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబును ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విమానాశ్రయానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని వారు కోరగా, స్పందించిన సీఎం తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డిని ఆదేశించారు.