'ఆకలితో ఉన్నవారికి అండగా కమ్యూనిటీ ఫ్రిజ్‌లు': విశాఖ పోలీస్ కమిషనర్ బ్రత బాగ్చి వినూత్న సేవలు

రిపోర్టర్: విజయ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో నిరాశ్రయులు మరియు ఆకలితో ఉన్నవారికి ఉచితంగా ఆహారం అందించేందుకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి 'మిషన్ జ్యోతిర్గమయ' కార్యక్రమంలో భాగంగా 5 కమ్యూనిటీ ఫ్రిజ్‌లను ప్రారంభించారు. ఈ వినూత్న సేవ ద్వారా రోజువారీగా అవసరమైన వారికి భోజనం అందుతోందని, దాతలు మరియు స్వచ్ఛంద సంస్థలు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ నగర పోలీసులు పిలుపునిచ్చారు.