కడ్తాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కడ్తాల్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మైసిగండికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బెక్కరి యాదగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.