విజయనగరం జిల్లాలో జనసేన పార్టీలోకి ముప్పై కుటుంబాల భారీ చేరికలు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలోని పద్దెనిమిదో వార్డుకు చెందిన తాడివలస జయప్రకాష్తో పాటు ముప్పై కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరారని సీనియర్ నేత గురాన అయ్యలు తెలిపారు. గురువారం జరిగిన కార్యక్రమంలో వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జయప్రకాష్ రాకతో స్థానికంగా పార్టీ మరింత బలపడుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరం కలసికట్టుగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.