సీతారాంపురం జడ్పీటీసీగా టీడీపీ నేత కుర్రా వెంకటలక్ష్మి ఏకగ్రీవ విజయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సీతారాంపురం
సీతారాంపురం జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి కుర్రా వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆర్వో ఆమెకు ఎన్నిక ధ్రువపత్రాన్ని అందజేశారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో నిధులు తెచ్చి మౌలిక వసతులు కల్పిస్తామని ఆమె తెలిపారు.