నాపై ఫేక్ ప్రచారం చేయడం దుర్మార్గం అంటున్న శ్వేత

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై ప్రతిపక్షం చేస్తున్న ఫేక్ ప్రచారంపై గోల్డ్ మెడలిస్ట్ శ్వేత తీవ్రంగా మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో మహిళా కబడ్డీలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించి, ఏషియన్ కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించిన తనను ఫేక్ అనడం అత్యంత దుర్మార్గమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన విజయమే ఆ పార్టీ ప్రచారానికి ప్రత్యక్ష నిదర్శనమని శ్వేత స్పష్టం చేశారు.