సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారుల దాడులను ఖండించిన ఐరాస

రిపోర్టర్: శివ స్థలం: దుబాయ్

యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉద్ధృతం చేయడంతో రాజధాని రియాద్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో దట్టమైన పొగ, మంటలు చెలరేగాయి. ఈ దాడులను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్య భద్రతకు ముప్పుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ కొన్ని షరతులను అమెరికాకు చేరవేసింది.