అమలాపురంలో ఘోర అగ్నిప్రమాదం దగ్ధమైన రెస్టారెంట్ సామగ్రి
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: అమలాపురం
అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ సమీపంలోని సర్కులర్ బజార్ పక్కన ఉన్న గీతాస్ రెస్టారెంట్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ లోని సామగ్రి మంటలకు ఆహుతయ్యాయి. గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.