అయోధ్య దీపోత్సవం: ముప్ పై లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయిన రామమందిరం

రిపోర్టర్: సునీల్ స్థలం: అయోధ్య

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ దీపోత్సవాన్ని ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఏకంగా ముప్ పై లక్షల దీపాలను వెలిగించి నగరమంతా ఆధ్యాత్మిక శోభను నింపారు. రెండు వేలకు పైగా డ్రోన్లతో నిర్వహించిన అద్భుతమైన ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుందని నిర్వాహకులు పేర్కొన్నారు.