వర్షాలు కురవాలని కోరుతూ పెన్నానది తీరంలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని రాష్ట్ర వక్ఫ్బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని రంగనాయకులపేట సమీపంలో ఉన్న పెన్నానది తీరంలో ముస్లిం సోదరులతో కలిసి శుక్రవారం ఆయన సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక నమాజ్లో పాల్గొని రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా దీవెనలు కోరారు.