వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి: బాచుపల్లి ఆసుపత్రి ఎదుట ఆందోళన

రిపోర్టర్: రాము స్థలం: బాచుపల్లి

వైద్యుల నిర్లక్ష్యంతోనే పద్నాలుగు నెలల చిన్నారి యశస్విని యోగిత మృతి చెందిందని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కిందపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, శస్త్రచికిత్స అనంతరం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబసభ్యులు వాపోయారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర నిరసనకు దిగారు.