కర్నూలులో డీజీసీఐ, క్యూసీఐ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
రిపోర్టర్: నరేష్
స్థలం: కర్నూలు
దేశంలో విమానయాన రంగాన్ని విస్తరించడంలో భాగంగా కర్నూలులో డీజీసీఐ, క్యూసీఐ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు వెల్లడించారు. శనివారం కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీని దేశానికి ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, యువతకు వైమానిక రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.