రంగారెడ్డి జిల్లాలో బఫర్ జోన్ లో నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేత
రిపోర్టర్: హరి
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని రాందాస్‌పల్లిలో తనరా వాలీ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో బఫర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సుమారు 100 మీటర్ల ప్రహరీ గోడను ఇరిగేషన్ శాఖ అధికారులు కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అధికారులు, హెచ్చరికలతో సరిపెట్టకుండా జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాన్ని తొలగించే ప్రక్రియను చేపట్టారు. బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.