'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత': శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Sri Sathya Sai District
శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ స్వయంగా ప్రజల నుంచి 70 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విని, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.