వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం

రిపోర్టర్: సురేష్ స్థలం: Kolkata

కోల్కతాలోని ఓ ఆసుపత్రిలో ప్రసవం తర్వాత బాలింతకు కుట్లు వేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇంటర్న్ డాక్టర్ సుదేష్ణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అధికారులు తెలిపారు. రోగి గోప్యతను విస్మరించి సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయడం అనైతికమని నెటిజన్లు, వైద్య నిపుణులు మండిపడుతున్నారు. బాలింత అనుమతి తీసుకునే ఈ ఫొటోను షేర్ చేసినట్లు డాక్టర్ సుదేష్ణ సమర్థించుకుంటున్నప్పటికీ, ఈ వివాదంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.