కరకంబాడిలో నేత్ర జ్యోతిని నింపిన రాస్ ఉచిత వైద్య శిబిరం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రేణిగుంట
రేణిగుంట మండలం కరకంబాడి గ్రామంలో రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరే కృష్ణ నేత్రాలయ సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పెద్దలు బుజ్జి నాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈ శిబిరంలో సుమారు 123 మంది గ్రామస్తులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 32 మందిని కంటి శుక్లాల ఆపరేషన్లకు ఎంపిక చేయగా, వారందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.