అనుబంధ సేవల ఛార్జీలను పెంచిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: భారతదేశం
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తమ అనుబంధ సేవల ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ సేవల రుసుములను సమీక్షించినట్లు తెలిపింది. కొత్త ధరల ప్రకారం అదనపు లగేజీ ఛార్జీ కిలోకు రూ. 700 నుంచి రూ. 800కి, ఫాస్ట్ ఫార్వర్డ్ సేవ రుసుము రూ. 650కి పెంచారు. అలాగే ఇన్ఫాంట్లు, పెద్దల తోడు లేకుండా ప్రయాణించే చిన్నారుల ప్రయాణ ఛార్జీలను కూడా భారీగా సవరించారు.