విజయనగరం జిల్లాలో కలకలం: రహదారిపై ప్రత్యక్షమైన పది అడుగుల కొండచిలువ

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని బూరాడ కూడలి వద్ద రహదారిపై సోమవారం రాత్రి పది అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైందని స్థానికులు తెలిపారు. వాహనదారులు భయంతో వాహనాలు నిలిపివేయడంతో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. గ్రామస్థుల సహకారంతో కొండచిలువను సురక్షితంగా రోడ్డు పక్కకు పంపించామని వారు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్నేక్క్యాచర్ సంఘటన స్థలానికి చేరుకుని పామును బంధించి జనసంచారం లేని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.