నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతులకు శుభవార్త: తక్కువ ధరలకే ప్రభుత్వ ల్యాబ్లలో పరీక్షలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు

జిల్లాలో అరవై వేల ఎకరాల్లో జరుగుతున్న ఆక్వాసాగును మరింత లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నెల్లూరు, కావలిలో ప్రభుత్వ ఆక్వా ల్యాబ్లు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ జేడీ పి.లక్ష్మణరావు వెల్లడించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇవి పనిచేస్తాయని తెలిపారు. సాధారణ నీటి పరీక్షలకు వంద రూపాయలు, మట్టి నాణ్యత విశ్లేషణకు రెండు వందల పది రూపాయలు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.