వైద్య విద్యార్థులకు భారీగా స్టైపెండ్ పెంపు ప్రకటించిన ప్రభుత్వం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి ప్రాంతం మరియు రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య రంగ బలోపేతమే ధ్యేయంగా రూ.34.08 కోట్ల అదనపు నిధులను కేటాయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.