నెల్లూరు కార్పొరేషన్ ఇరవై మొదటి డివిజన్లో విజయలక్ష్మి గునుకుల రెండో విడత ప్రచారం
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు నగరంలోని ఇరవై మొదటి డివిజన్ కూటమి అభ్యర్థి గునుకుల విజయలక్ష్మి సోమవారం రామ్జీనగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత నెల రోజులుగా ప్రతి గడపను పలకరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఆమె, కూటమి సంక్షేమ పథకాలను వివరిస్తూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.