కావేరి-2.0 పోర్టల్ సాంకేతిక లోపంపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు

రిపోర్టర్: శివ స్థలం: కర్ణాటక

కావేరి-2.0 రిజిస్ట్రేషన్ పోర్టల్‌లోని సాంకేతిక లోపాలను సరిదిద్దాలని కర్ణాటక హైకోర్టు అధికారులను ఆదేశించింది. శాశ్వత లీజు భూముల్లో ఫ్లాట్ల విక్రయాలను సాఫ్ట్‌వేర్ పరిమితులు నిరోధించలేవని స్పష్టం చేసింది. రెండు నెలల్లోగా సిస్టమ్‌ను అప్‌డేట్ చేయాలని, లేనిపక్షంలో మ్యాన్యువల్‌గా సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్ చేయాలని తేల్చిచెప్పింది.