ప్రజల బలంతోనే స్థానిక ఎన్నికల్లో గెలుస్తామంటూ వైసీపీ ప్రచారం హోరు

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో గురువారం స్థానిక ఎన్నికల ప్రచారాన్ని నరసనాయుడుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, కమ్మపల్లి రోడ్డు, నర్సిరెడ్డిపల్లి, అరుంధతివాడ అలాగే హరిజనవాడపల్లి గ్రామాలలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చింతకుంట రాజేశ్వరి ఇంటింటా నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరగా, తమకు అధికార బలం లేకున్నా ప్రజల బలం ఉంటుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.