తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ముంబైలో రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ కీలక భేటీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ముంబై
తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోని తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై కీలక అడుగు పడింది. ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాస్థాయి బృందం సమావేశమైందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు డిజైన్లు, నీటి మళ్లంపు, ముంపు ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సమగ్ర వివరాలు అందజేశారు.