జిల్లా స్థాయి క్రీడాపోటీలకు స్వాములవారిలింగోటం విద్యార్థుల అరుదైన ఎంపిక
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 6 నుండి 10 వ తరగతుల విద్యార్థులు వివిధ విభాగాలలో వాలీబాల్, కబ్బడి, ఖోఖో జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మండల స్థాయి ఎంపికలలో అత్యుత్తమ ప్రతిభ చాటి వీరు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నోముల పురుషోత్తం రెడ్డితో పాటు ఉపాధ్యాయులు అభినందించి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.