కాలిఫోర్నియాలో అరుదైన చారిత్రక స్పానిష్ రాంచ్ భూములకు సంరక్షణ భద్రత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: California

కాలిఫోర్నియాలోని కుయామా వ్యాలీలో ఉన్న 5,650 ఎకరాల చారిత్రక స్పానిష్ రాంచ్ వాణిజ్య అభివృద్ధి నుండి శాశ్వతంగా రక్షణ పొందింది. కాలిఫోర్నియా రెంజ్ ల్యాండ్ ట్రస్ట్ భాగస్వామ్యంతో డోయిరాన్ కుటుంబం నిర్వహించే ఈ ప్రాంతాన్ని శాశ్వత వ్యవసాయ సంరక్షణ ఈజ్‌మెంట్ ద్వారా పరిరక్షించారు. పది లక్షల డాలర్ల నిధుల సేకరణతో వన్యప్రాణి కారిడార్లు, అడవులను కాపాడుతూ ఈ చారిత్రక ఒప్పందం కుదిరినట్లు కాలిఫోర్నియా రెంజ్ ల్యాండ్ ట్రస్ట్ ప్రకటించింది.