'మద్యం తాగి బస్సు నడిపితే జైలే': నంద్యాల జిల్లా పోలీసుల సంచలన హెచ్చరిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: Nandyal

నంద్యాల జిల్లాలో మద్యం సేవించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నడిపిన డ్రైవర్‌కు కోర్టు 5 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, డ్రింక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.