తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదంటూ ఎంపీ వంశీకృష్ణ విమర్శ

రిపోర్టర్: కిరణ్ స్థలం: పెద్దపల్లి

తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేత కేటీఆర్కు లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీల పనితీరును ప్రశ్నిస్తున్న కేటీఆర్, గత పదేళ్ల తమ పాలనలో ఆర్ఎఫ్సీఎల్, యూరియా కొరత వంటి రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.