ఢిల్లీ జాతీయ ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పిలుపు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

నవంబర్ మొదటి తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఓట్ బచావో దేశ్ బచావో జాతీయ ర్యాలీని విజయవంతం చేసే లక్ష్యంతో నిర్మల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు ముఖ్య నేతలు హాజరై తెలంగాణ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపుపై విస్తృతంగా చర్చించారు.