డార్క్ చాక్లెట్ ట్రైలర్ లాంచ్: నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు విభిన్న చిత్రం
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కిన డార్క్ చాక్లెట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించారు. నవంబర్ 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.