కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ ప్రశంసలతో మోధా రాత్రి చిత్రబృందం ఖుషీ

రిపోర్టర్: రాము స్థలం: చెన్నై

మోధా రాత్రి సినిమాను వీక్షించి అభినందించిన ప్రముఖ నటుడు శివకార్తికేయన్కు దర్శకుడు రాజా సామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన చిన్ననాటి ఆరాధ్యుడి నుంచి ప్రశంసలు అందుకోవడం జీవితంలో మరువలేని క్షణమని ఆయన పేర్కొన్నారు. రిషికాంత్, అనిష్మా అనిల్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఓటీటీ విడుదల తర్వాత విశేష ఆదరణ దక్కించుకుంటోందని దర్శకుడు వెల్లడించారు.