విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ సంచలన నిర్ణయం: హాస్టళ్లలో యాంటీ సూసైడ్ ఫ్యాన్లు
రిపోర్టర్: సురేష్
స్థలం: సూరత్
విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి మరియు ఆత్మహత్యల నివారణకు గుజరాత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ కిషోర్సింహ్ చావ్డా తెలిపారు. హాస్టల్ గదుల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన 354 యాంటీ సూసైడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లోనే తొలిసారిగా ఒక విశ్వవిద్యాలయం ఇటువంటి సాంకేతిక భద్రతా చర్యలను చేపట్టడం విశేషం.